కుమార్తె పై వాటర్ హీటర్ పడి గాయాలు.. హోటల్‌పై దావా వేసిన మహిళ

- December 27, 2022 , by Maagulf
కుమార్తె పై వాటర్ హీటర్ పడి గాయాలు.. హోటల్‌పై దావా వేసిన మహిళ

యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఒక హోటల్‌లోని బాత్రూంలో వాటర్ హీటర్ పడటంతో ఒక అరబ్ మహిళ, ఆమె కుమార్తెలకు ఫస్ట్-డిగ్రీ కాలిన గాయాలు అయ్యాయి. తాము బాత్‌రూమ్‌లో ఉండగా.. సీలింగ్ పడి హీటర్ తమపై పడిందని కేసు పత్రాల్లో పేర్కొన్నారు. దీనిపై హోటల్, నిర్వహణ అధికారిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తాము అనుభవించిన భౌతిక, నైతిక నష్టాలకు పరిహారంగా Dh21,000 చెల్లించాలని కోరుతూ తల్లి హోటల్, దాని నిర్వహణ విభాగంపై దావా వేసింది. హీటర్ సరిగ్గా అమర్చకపోవడం వల్లే పడిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. కేసును విచారించిన రస్ అల్ ఖైమా కోర్టు మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారికి Dh1,000 జరిమానా విధించి కేసును వాణిజ్య కోర్టుకు రిఫర్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com