‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్ సాంగ్.! మెగా ఫ్యాన్స్‌లో పూనకాలే.!
- December 27, 2022
తెలుగోళ్ల పెద్ద పండగ సంక్రాంతికి పెద్దన్న చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’గా వస్తూ అసలు సిసలు పండగ తీసుకురానున్న సంగతి తెలిసిందే.
జనవరి 13న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్న ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లు షురూ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే రిలీజైన రెండు పాటల్లో ఒకటైన బాస్ పార్టీ దుమ్ము దులిపేసింది. రెండో పాట నువ్వు శ్రీదేవి అయితే, నేను చిరంజీవి..’ రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేసింది.
ఇక ముచ్చటగా మూడో పాటను రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌కి మెగా ట్రీట్ ఇచ్చాడు ‘వాల్తేర్ వీరయ్య’. ‘వీరయ్యా..’ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవిని చూసి పూనకాలొచ్చేస్తున్నాయ్ ఫ్యాన్స్‌కి.
సినిమా ఎలా వున్నా ఈ ఒక్క పాట ధియేటర్లో ధూమ్ ధామ్ చేసేయడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ కసి కసిగా కొట్టేశాడు ఈ పాటకి మ్యూజిక్. అనురాగ్ కులకర్ణి గాత్రంలో చిరంజీవి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ, వదిలిన ఈ పాట విడుదలైన నెక్స్ట్ సెకన్ నుండీ వ్యూస్ రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్, చిరంజీవికి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







