ఇట్స్ ‘ధమాకా’ టైమ్.! మొత్తానికి మాస్ రాజా గట్టెక్కేశాడుగా.!

- December 27, 2022 , by Maagulf
ఇట్స్ ‘ధమాకా’ టైమ్.! మొత్తానికి మాస్ రాజా గట్టెక్కేశాడుగా.!

వరుస ఫెయిల్యూర్స్‌తో వణికిపోయిన మాస్ రాజా రవితేజకి ‘ధమాకా’ రూపంలో ఓ హిట్ పడిపోయినట్లే అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిశంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి ఓపెనింగ్స్ అందుకుంది ‘ధమాకా’.
రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ ‘ధమాకా’ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌నీ, యాక్షన్‌నీ రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో, ఓ మోస్తరు వసూళ్లు కలెక్ట్ చేసింది ‘ధమాకా’.
ఇక, నాలుగో రోజు కూడా ధమాకా షోస్ కళకళలాడుతుండడంతో, రవితేజ బ్రేక్ ఈవెన్ అవుతాడని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా వుంటే, త్వరలో ‘వాల్తేర్ వీరయ్య’ కూడా లైన్‌లో వుంది.
మెగాస్టార్ చిరంజీవితో లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. రవితేజ క్యారెక్టర్ కూడా ఆసక్తిగా వుండడంతో, రవితేజ ఫేట్ మారినట్లే అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓ పక్క ‘ధమాకా’ సక్సెస్, మరో పక్క, ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్స్.. అబ్బో ముందు ముందు మాస్ రాజా మజా మామూలుగా వుండేలా లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com