అన్‌స్టాపబుల్ 2.! పవర్ స్టార్‌కి ప్రత్యేకంగా వెల్‌కమ్ చెప్పిన బాలయ్య.!
- December 27, 2022
ఆహా ఓటీటీ వేదికగా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి నటసింహం బాలయ్య హోస్టింగ్‌లో ఈ టాక్ షో విజయవంతంగా రన్ అవుతోంది. మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది. సినీ ప్రముఖులతో పాటూ, అప్పుడప్పుడూ రాజకీయ ప్రముఖులను సైతం ఈ టాక్ షోలో అతిథులుగా తీసుకొస్తున్నారు బాలయ్య.
తనదైన పంచ్ డైలాగులతో షోని రక్తి కట్టిస్తున్నారు. కాగా, మొదటి సీజన్ మంచి రెస్పాన్స్ రావడంతో, రెండో సీజన్ అంతకు మించిన అంచనాలతో ప్రారంభమైంది. అందుకు ఏమాత్రం అంచనాలు తగ్గకుండా రెండో సీజన్‌లో స్టార్ సెలబ్రిటీలను భాగం చేస్తున్నారు బాలయ్య.
ప్రబాస్, మహేష్.. ఇలా ప్రముఖ సినీ స్టార్లతో ఆల్రెడీ షో షూటింగ్స్ జరిగాయ్. త్వరలో ప్రబాస్‌తో షో టెలికాస్ట్ కానుంది. కాగా, పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా రావడం ఈ సీజన్‌కే హైలైట్‌గా చెబుతున్నారు. కానీ, పవన్ వస్తాడో లేడా అన్నది అనుమానమే ఇంతవరకూ. కానీ, ఆ అనుమానాలన్నింటికీ తాజా వీడియో ద్వారా చెక్ పెట్టేశారు.
పవన్ ఈ షోకి హాజరవుతున్ననేపథ్యంలో ‘అన్‌స్టాపబుల్ 2’ టీమ్‌తో పాటూ, హోస్ట్ బాలయ్య, పవన్ కల్యాణ్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతున్నారు. ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని పవన్‌కి వెల్‌కమ్ చెబుతున్నారు బాలయ్య ఈ వీడియోలో. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!







