నేడు ప్రధాని మోడీతో సిఎం జగన్ భేటీ
- December 28, 2022
న్యూఢిల్లీ: సిఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా పెండింగ్ బకాయిలు, ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు జగన్ తో పాటు వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఇదిలావుంచితే, ఈ నెల మొదటి వారంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశానికి జగన్ హాజరైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







