సౌదీలో ఒమానీ ఒంటెల చరిత్ర పై ప్రదర్శన

- December 28, 2022 , by Maagulf
సౌదీలో ఒమానీ ఒంటెల చరిత్ర పై ప్రదర్శన

మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలతో రాయల్ కామెల్ కార్ప్స్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో జనవరి 3 నుండి 7 వరకు ఒమానీ ఒంటెల చరిత్రపై సెమినార్, ప్రదర్శనను నిర్వహిస్తుంది. రియాద్‌లోని ఒమన్ రాయబార కార్యాలయం సహకారంతో నిర్వహించే ఈ సెమినార్ లో ఒమనీ ఒంటెలు, వాటి చరిత్ర, మూలాలు, వాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నారు. ఒమానీ స్వచ్ఛమైన ఒంటెల జాతులను సంరక్షించడంలో రాయల్ ఒంటె కార్ప్స్ పాత్రను ప్రదర్శన సందర్భంగా హైలైట్ చేయనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com