'సామ్సన్ అండ్ దెలీలా' బుర్రకథ ప్రదర్శించిన చిల్కూరి బృందం

- December 28, 2022 , by Maagulf
\'సామ్సన్ అండ్ దెలీలా\' బుర్రకథ ప్రదర్శించిన చిల్కూరి బృందం

హైదరాబాద్: హైదరాబాద్‌లో క్రిస్మస్ రోజున జరిగిన బోలారం సమీపంలోని కౌకూర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో “సామ్సన్ అండ్ దెలీలా” బైబిల్ కథ పై బుర్రకథ ప్రదర్శనను చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించారు. చిల్కూరి వసంతరావు ఆధ్వర్యంలో అతని సోదరులు చిల్కూరి శ్యామ్ రావు, చిల్కూరి సుశీల్ రావు  చిల్కూరి బుర్రకథ బృందంలో ప్రధాన భూమికి వహిస్తారు.

1978లో వీరు 'సామ్సన్ అండ్ డెలీలా' తొలిప్రదర్శన ఇచ్చారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలతో పాటు మెదక్, సంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డిగూడ, వైజాగ్, విజయనగరం, కాకినాడలో 60 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు.  ఈ సందర్భంగా చిల్కూరి వసంత్‌రావు మాట్లాడుతూ “కథ మొత్తం గుర్తుకు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఒకసారి కథనంలోకి దిగగానే కథ వరుస క్రమంలో అదే వచ్చేస్తుంది. ప్రారంభంలో ప్రసిద్ధ సురభి థియేటర్ గ్రూప్ మమ్మల్ని ప్రోత్సాహాన్ని అందించింది.’’ అని పేర్కొన్నారు.

జానపద కళల ద్వారా వివరించబడిన కథలలో బైబిల్ నుండి 'నెహెమ్యా' కథను ప్రధానంగా చెబుతారు. చర్చిలు ప్రత్యేక సందర్భాలలో నిర్వహించబడే 'జాతర'ల సమయంలో ప్రధానంగా ప్రదర్శనలు ఇవ్వబడతాయన్నారు.

చిల్కూరి వసంతరావు జర్మనీ నుండి పిహెచ్‌డి పట్టా పొందారు.ప్రస్తుతం యునైటెడ్ థియోలాజికల్ కళాశాల, బెంగళూరు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. అతని అన్న చిల్కూరి శ్యామ్ రావు హైదరాబాద్‌లో ప్రముఖ న్యాయవాది.అతని తమ్ముడు చిల్కూరి సుశీల్ రావు సినిమా నిర్మాత, మీడియా పర్సన్. ముగ్గురు సోదరులు సంవత్సరాలుగా అనేక తెలంగాణ క్రైస్తవ జానపద పాటలను ప్రదర్శించి రికార్డ్ చేసినప్పటికీ, బుర్రకథ ప్రదర్శన ద్వారా గుర్తింపు పొందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com