భారత్ లో కరోనా విజృంభించే ముప్పు..
- December 28, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో జనవరిలో కరోనా విజృంభించే ముప్పు ఉందని, తదుపరి 40 రోజులు చాలా కీలకమని ఓ అధికారి జాతీయ మీడియాకు చెప్పారు. చైనా, జపాన్ తో పాటు పలు దేశాల్లో ఇప్పటికే కరోనా మళ్ళీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత గణాంకాలను బట్టి చూస్తే భారత్ లోనూ కరోనా వ్యాప్తి చెందవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
గతంలో తూర్పు ఆసియాలో కరోనా విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్ లోనూ ఆ వైరస్ వ్యాప్తి చెందిందని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఓ అధికారి చెప్పారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు స్పందిస్తూ… దేశంలో కరోనా విజృంభించినప్పటికీ, ఇన్ఫెక్షన్ తీవ్రత, మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అన్నారు.
చైనా, దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన అన్ని చర్యలపై సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ కూడా ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. జనవరిలో దేశంలో కరోనా వ్యాప్తి చెందే ముప్పు ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 బాగా వ్యాప్తి చెందుతోంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







