చంద్రబాబు సభలో అపశృతి, పోటెత్తిన జనం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి
- December 28, 2022
అమరావతి: నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్నది.సభా ప్రాంగణానికి దగ్గరలో మురికి కాలువ ఉండగా.. సభకు హాజరయ్యే క్రమంలో తోపులాట జరిగిందని సమాచారం. పలువురు కాలువలో పడిపోయగా.. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. తొక్కిసలాటలో పలువురు గాయపడగా.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యాసంస్థల్లో చదివిపిస్తామని హామీ ఇచ్చారు. తోపులాట నేపథ్యంలో సభను రద్దు చేసుకున్నారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించారు. సంతాపంగా మృతులకు రెండు నిమిషాలు మౌనం ప్రకటించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







