యాక్షన్ థ్రిలర్ తో రెడీ అయిన ఆది సాయికుమార్
- December 29, 2022
హైదరాబాద్: విభిన్న కథా, కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్న ఆది ఈసారి కొత్త సంవత్సరం రాక ముందే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టాప్ గేర్ అంటూ యాక్షన్ థ్రిలర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను డైరెక్టర్ మారుతితో రిలీజ్ చేయించారు చిత్రయూనిట్. దీంతో మోషన్ పోస్టర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆది ట్యాక్సీ డ్రైవర్‌గా నటించడంతోపాటు, హీరో క్యారెక్టర్ కూడా టాప్ గేర్‌లోనే ఉండటంతో చిత్రానికి అదే టైటిల్ ను ఫిక్స్ చేశారట యూనిట్. టాప్ గేర్ సినిమా అంతా కూడా కారులోనే ఉంటుందని, విభిన్న కాన్సప్ట్ తో ఈ కథను డైరెక్టర్ కె. శశి కాంత్ అద్భుతంగా తీర్చిదిద్దారట. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో ఆది సరసన రియా సుమన్ హీరోయిన్గా నటించగా, శత్రు, రేడియో మిర్చి హేమంత్, బెనర్జీ, మైమ్ గోపి, నర్రా, చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్, బ్రహ్మాజీ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
ఏమైనా కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ టాప్ గేర్ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. మరి ఈ న్యూఇయర్ కు ఆదికి ఈ చిత్రం ఎలా వెలకమ్ చెబుతుందో చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి