కందుకూరు ఘటన పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
- December 29, 2022
న్యూ ఢిల్లీ: నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
కందుకూరు తొక్కిసలాట ఘటనలో మృతులకు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో పోస్టమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను ఎనిమిది అంబులెన్స్‌ల ద్వారా స్వస్థలాలకు తరలించనున్నారు. మృతులకు టీడీపీ తరపున అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కందుకూరులోనే చంద్రబాబు ఉన్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!