రాహుల్ కి భద్రత పెంచిన ఢిల్లీ పోలీసులు

- December 30, 2022 , by Maagulf
రాహుల్ కి భద్రత పెంచిన ఢిల్లీ పోలీసులు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలీసులు భద్రత పెంచారు. భారత్ జోడో యాత్రకు సరైన భద్రత కల్పించడం లేదంటూ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఢిల్లీ పోలీసులు పలు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇవాళ దాదాపు గంటన్నర పాటు ఢిల్లీ పోలీసు అధికారులు సమావేశమై రాహుల్ కు భద్రతపై చర్చించారు.

ఈ సమావేశంలో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి, రాహుల్ కు చెందిన ఇతర ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పోలీసులు పలు వివరాలు తెలిపారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో ఆయన చుట్టూ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక స్వాడ్ ను నియమిస్తున్నట్లు చెప్పారు. శక్తిమంతమైన రక్షణ వలయంగా వారు ఉంటారని, అందులోకి అనధికార వ్యక్తులు ఎవరినీ రాణించబోరని తెలిపారు.

కాగా, డిసెంబరు 24న నిర్వహించిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, ఢిల్లీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అమిత్ షాకు కూడా లేఖ రాసింది. అయితే, రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని కేంద్ర రిజర్వు పోలీసు దళం (CRPF) పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com