దుబాయ్ లోనూ విజిట్ వీసా పొడిగింపు పై నిషేధం
- December 30, 2022
దుబాయ్: విజిట్ వీసా హోల్డర్‌లు..దుబాయ్ జారీ చేసిన పర్మిట్‌లతో సహా వారి వీసాలను యూఏఈ లో ఉండి పునరుద్ధరించుకోవడాన్ని నిలిపివేశారు. "ఇకపై యూఏఈలో ఉంటూ ఏ టూరిస్టరూ తమ వీసా స్థితిని మార్చుకోవడానికి మరిన్ని అవకాశాలు లేవు. తమ వీసాలను పునరుద్ధరించాలనుకునే వ్యక్తులు దేశం నుండి నిష్క్రమించి, ఆపై తిరిగి రావాలి." అని మూస మూస్జి ట్రావెల్ & టూరిజం LLC బిజినెస్ హెడ్ రాజేష్ బాబు యాదవ్ రాగం తెలిపారు. యూఏఈలో ఈ నెల (డిసెంబర్ లో) ప్రారంభంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధన ప్రకారం పర్యాటకులకు దేశంలోని వారి విసిట్ వీసాలను పొడిగించే ఎంపికను యూఏఈ నిలిపివేసింది. అయితే, దుబాయ్ లోని వారి వీసాలను పునరుద్ధరించుకోవడానికి టూరిస్టులను అనుమతిని ఇవ్వడం కొనసాగించింది. కానీ, తాజాగా వీసాల పొడిగింపును దుబాయ్ కూడా సస్పెండ్ చేసింది.
"దేశంలోనే తమ వీసాలను పొడిగించాలని ఆశతో అనేక కుటుంబాలు, వృద్ధులు మమ్మల్ని సంప్రదించారు. అయితే, అది సాధ్యం కాదు. వారు ఇప్పుడు దేశం విడిచి వెళ్లి కొత్త విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాతే తిరిగి రావాలి." అని రాజేష్ బాబు తెలిపారు. గతంలో కూడా ఇదే నియమం ఉండేదని, కానీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిబంధనలను మార్చారాని ఆయన తెలిపారు. లాక్డౌన్ల సమయంలో, ప్రయాణం కష్టంగా మారినప్పుడు, మానవతా ఆందోళనల కారణంగా యూఏఈ నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకున్నందున, మునుపటి మాదిరే వీసా నిబంధనలను అమలు చేయాలని యూఏఈ నిర్ణయించింది.
దేశంలో ఉద్యోగం సంపాదించిన లేదా రెసిడెన్సీ వీసా కోసం వెళ్లాలని ఎంచుకునే టూరిస్ట్ లు కూడా దేశం నుండి నిష్క్రమించాలని, వీసా స్థితిని మార్చుకున్నాకే తిరిగి ప్రవేశించాలని సలహా ఇస్తున్నట్లు ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది.ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు విమానాలు, బస్సులకు డిమాండ్ భారీగా పెరగడానికి దారి తీసిందని వారు తెలిపారు. ముఖ్యంగా యూఏఈ నుండి వీసా స్థితి మార్పుల కోసం ప్రజలు బహ్రెయిన్, కువైట్, మస్కట్‌లకు వెళుతున్నారని రాజేష్ బాబు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!