రైతుల మార్కెట్‌ను సందర్శించిన 60,000 మంది

- January 02, 2023 , by Maagulf
రైతుల మార్కెట్‌ను సందర్శించిన 60,000 మంది

బహ్రెయిన్: డిసెంబర్ 10న ప్రారంభమైన బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు సందర్శకులు పోటెత్తారు.నాలుగు వారాల్లో సుమారు 60,000కుపైగా ప్రజలు, నివాసితులు, పర్యాటకులు సందర్శించారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (NIAD) భాగస్వామ్యంతో మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ మార్కెట్‌ని నిర్వహిస్తుంది.ఈ సంవత్సరం ఎడిషన్‌లో బహ్రెయిన్ రైతులు, వ్యవసాయ కంపెనీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతోపాటు కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం మార్కెట్‌ను మరింత పెంచడానికి దోహదపడ్డాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత బహ్రెయిన్ రైతు మార్కెట్‌ తిరిగి ఊపందుకోవడంపై రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బహ్రెయిన్ రైతుల మార్కెట్ ప్రతి శనివారం బుదయ్య బొటానికల్ గార్డెన్‌లో ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com