‘యువశక్తి ‘ పేరుతో జనసేన భారీ సభ
- January 02, 2023
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించగా..ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు జనవరి 12 న శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి ‘ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో.. రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోందని పవన్ అన్నారు.
యువతీయువకులు అందరూ ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. యువత తమ ఆలోచనల గురించి.. వారి కష్టాల గురించి.. వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుందని పవన్ వివరించారు. మన యువత.. మన భవిత.. అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
జనవరి 12న ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని.. యువతకు భరోసా ఇవ్వడానికే యువశక్తి సభ నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. యువశక్తికి సంబంధించి జనసేన ఓ వీడియోను విడుదల చేసింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







