వైష్ణవ్ పంజా కొత్త సినిమా.! ఇది చాలా స్పెషల్ గురూ.!
- January 03, 2023
పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్యాండమిక్ టైమ్‌లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో బాక్సాఫీస్‌కి కాసుల పంట పండించాడు పంజా వైష్ణవ్ తేజ్.
తొలి సినిమా ఆ స్థాయిలో సూపర్ హిట్ అవ్వడంతో, తదుపరి సినిమా కోసం పెద్దగా అంచనాల్లేని కాన్సెప్ట్ ఛూజ్ చేసుకుని ఫర్వాలేదనిపించాడు. అదే ‘కొండ పొలం’.
ముచ్చటగా మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ అంటూ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చాడు. ధియేటర్లలో ఈ సినిమా ఆడకపోయినా, ఓటీటీ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. వైష్ణవ్‌లో చాలా విషయముందని ప్రూవ్ చేసింది.
ఇక ఇప్పుడు నాలుగో సినిమా కోసం కొత్త డైరెక్టర్‌ని ఎంగేజ్ చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సారి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండడం సినిమాకీ, వైష్ణవ్‌కీ కూడా కలిసొచ్చే అంశమే.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







