ఒంగోలు లో వీరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక
- January 03, 2023
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 06 న ఒంగోలు లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..ఇక సినిమా తాలూకా ప్రీ రిలీజ్ వేడుక ను ఒంగోలులోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో, ఈ నెల 6వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు.ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు.రామ్ లక్ష్మణ్ ఫైట్స్.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా కావడం , క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని వీరిద్దరి కలయిక లో ఈ సినిమా వస్తుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. మరి ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







