అజ్మాన్ లో బస్సు ఛార్జీలపై 30% తగ్గింపు

- January 04, 2023 , by Maagulf
అజ్మాన్ లో బస్సు ఛార్జీలపై 30% తగ్గింపు

యూఏఈ: మస్సార్ కార్డ్‌లను కలిగి ఉన్న విద్యార్థులకు బస్సు ఛార్జీలలో 30 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు అజ్మాన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ATA) ప్రకటించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. ప్రజా రవాణా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎమిరేట్‌లోని బస్ ఫ్లీట్ ఇటీవల అప్‌డేట్ చేయబడిందని తెలిపింది.

మస్సర్ కార్డ్ కోసం అధికార అధికారిక వెబ్‌సైట్‌(www.ta.gov.ae)ను సందర్శించాలి. షేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ నుయిమి స్ట్రీట్‌లోని అజ్మాన్ సెంట్రల్ బస్ స్టేషన్‌ను సందర్శించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు

అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మస్సర్ కార్డ్ అభ్యర్థనను ఎంచుకోవాలి. ఎమిరేట్స్ ID వివరాలను నమోదు చేసి, దరఖాస్తు ఫారమ్‌కు క్లిక్ చేయాలి. వివరాలను పూర్తి చేసి, ఆపై పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఎమిరేట్స్ ID,  ఇటీవలి ఫోటో కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ నమోదిత ఇమెయిల్ IDకి నిర్ధారణ మెయిల్ పంపబడుతుంది. కన్ఫర్మేషన్ మెయిల్ ప్రింటౌట్ తీసుకుని, అజ్మాన్ సెంట్రల్ బస్ స్టేషన్‌నికి వెళ్లి మస్సర్ కార్డ్‌ని తీసుకోవాలి.

మస్సర్ కార్డ్ ధర

మస్సర్ కార్డ్ ధర Dh 25. కార్డ్ బ్యాలెన్స్ Dh20 తో అందుబాటులో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com