సౌదీలో 3 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు పట్టివేత
- January 05, 2023
రియాద్: సౌదీ అరేబియాలో 3 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను రాజ్యంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారని డ్రగ్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. మాదక ద్రవ్యాల నిరోధక అధికార ప్రతినిధి మేజర్ మొహమ్మద్ అల్-నుజైదీ మాట్లాడుతూ.. యువత భద్రతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రమోషన్ నెట్‌వర్క్‌ల సెక్యూరిటీ ఫాలో-అప్ సమయంలో" అధికారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. 3,049,451 యాంఫెటమైన్ మాత్రలను ట్రక్కు కంపార్ట్మెంట్లలో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో ఈ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. రాజధాని రియాద్, తూర్పు ప్రావిన్స్‌లో ముగ్గురు సౌదీ పౌరులను అరెస్టు చేసినట్లు అల్-నుజైదీ చెప్పారు. వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు అల్-నుజైదీ తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







