‘ఆన్లైన్ ఫ్రాడ్ ప్రివెన్షన్ టూల్’ ప్రారంభించిన యూఏఈ బ్యాంక్
- January 05, 2023
యూఏఈ: దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫుజైరా (NBF) "CVVkey"ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది బ్యాంక్ జారీ చేసిన అన్ని క్రెడిట్, డెబిట్ కార్డ్‌లలో ఉపయోగించబడే ఆన్లైన్ కార్డ్ మోసాలను అరికడుతుందని పేర్కొంది. కస్టమర్ల సైబర్ భద్రతను మెరుగుపరచడానికి, మోసం, ఆన్లైన్ ఫ్రాడ్ ల నుండి రక్షించడానికి చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ‘CVVkey’ని తీసుకొచ్చినట్లు NBF వెల్లడించింది.
CVVkey ఎలా పనిచేస్తుందటే..
CVVkey కార్డ్ వెనుక ఉన్న 3-అంకెల CVV కోడ్‌ని డైనమిక్ CVV కోడ్‌తో రిప్లేస్ చేస్తుంది. కొత్త సీవీవీ నంబర్ ను కార్డ్ హోల్డర్ ఫోన్లోని CVVkey యాప్ ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి కొన్ని గంటలకు CVVkey యాప్ సేవలో నమోదు చేసుకున్న ప్రతి కార్డ్‌కు ప్రత్యేకమైన 3-అంకెల డైనమిక్ సెక్యూరిటీ కోడ్‌ను అందిస్తుంది. కార్డ్ వెనుక ఉన్న మూడు-అంకెల భద్రతా కోడ్‌ని అభ్యర్థించినప్పుడు (ఉదాహరణకు, ఆన్లైన్ కొనుగోళ్ల కోసం చెక్అవుట్ సమయంలో), కార్డ్ హోల్డర్ వారి ఫోన్లోని యాప్ నుండి కొత్త కోడ్‌ను తెలుసుకొని నమోదు చేస్తారు.
నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫుజైరా CEO విన్స్ కుక్ మాట్లాడుతూ.. CVVkey వంటి వినూత్న డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంలో NBF మరోసారి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. CVVkey క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను అనధికారిక వినియోగం నుండి రక్షిస్తుందన్నారు. కార్డ్‌ని పోగొట్టుకున్నా, ఫోన్లో CVVkey కోడ్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుందని, కార్డ్‌ని క్యారీ చేయడం, షాపింగ్ చేయడం మరింత సురక్షితంగా మారుతుందన్నారు.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







