స్పీకర్ అహ్మద్ తో సమావేశమైన భారత రాయబారి పీయూష్
- January 06, 2023
మనామా: కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లంతో బహ్రెయిన్ రాజ్యంలో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అహ్మద్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు, అన్ని స్థాయిలలో శాశ్వత వృద్ధిని ప్రశంసించారు. ఆసియా ఖండం అభివృద్ధిలో భారతదేశం పోషించిన కీలక పాత్రను కొనియాడారు. భారతదేశం-గల్ఫ్ మధ్య దృఢమైన సంబంధాలను, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి ఆసక్తిని వ్యక్త పరిచారు. ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేయడంలో ప్రతినిధుల మండలి పాత్రను కొనియాడుతూ బహ్రెయిన్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు పరస్పర ఆసక్తిని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రశంసించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







