ఒమన్ ఉత్తర భాగంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- January 06, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఉత్తర భాగంలో అల్పపీడనం కారణంగా ముసందమ్, ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లలో వర్షాలు కురుస్తున్నాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. ముసందమ్, నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉన్నది. దీని కారణంగా దక్షిణ అల్ షర్కియా, అల్ వుస్తా, ధోఫర్ గవర్నరేట్‌లలో రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు పడతాయి. తెల్లవారుజామున మేఘావృతమై పొగమంచు ఏర్పడుతుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. వాయుగుండం ప్రభావంతో ఆదివారం వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. ముసందమ్ గవర్నరేట్ మొదలుకొని అల్ బురైమి, నార్త్ అల్ బతినా, అల్ దహిరా గవర్నరేట్‌లకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటీరియాలజీ వెల్లడించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







