సౌదీలో విక్రయించే ఆహార పదార్థాలన్నీహలాల్ చేసినవే: ఎస్ఎఫ్డీఏ

- January 06, 2023 , by Maagulf
సౌదీలో విక్రయించే ఆహార పదార్థాలన్నీహలాల్ చేసినవే: ఎస్ఎఫ్డీఏ

రియాద్: రాజ్యంలో విక్రయించే అన్ని ఆహార పదార్థాలు హలాల్ చేసినవేనని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) పునరుద్ఘాటించింది. "ఆమోదించిన ప్రామాణిక స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఉండేలా కింగ్‌డమ్‌లోని ఆహార ఉత్పత్తులపై నిఘా కొనసాగుతుంది. ఆహార పదార్థాల తయారీపై అధికారుల ఫాలో-అప్ ఉంటుంది. ఆహార పదార్థాల నాణ్యతపై మేము మీకు హామీ ఇస్తున్నాము." అని అధికార యంత్రాంగం తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

కింగ్‌డమ్‌లో అందుబాటులో ఉన్న ఒక ప్రసిద్ధ బిస్కెట్ బ్రాండ్‌లో పంది కొవ్వు ఉందని సోషల్ మీడియాలో ప్రసారం జరిగింది. ఈ సోషల్ మీడియా ప్రచారంపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) స్పందించి ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా సందేహాస్పద ఉత్పత్తులను ముందుజాగ్రత్తగా ప్రయోగశాలకు తరలించి వాటి ప్రామాణికత, ప్రామాణిక స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకుంటామని తెలిపింది. ప్రచారంలో ఉన్న ఓరియో బిస్కెట్‌ల ఉత్పత్తి నిజంగా హలాల్ అని అథారిటీ ధృవీకరించింది. "మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, పాకిస్తాన్ కోసం తయారు చేయబడిన మా Oreo కుకీలు ఆల్కహాల్ లేనివి. సౌదీలో అమలులో ఉన్న నియంత్రణ,ప్రమాణాలకు అనుగుణంగా మా కుకీలు ఉంటాయి. మా తయారీ సౌకర్యాలు సంబంధిత అధికారుల నుండి హలాల్ ధృవీకరణను పొందాయి." అని ఓరియో బిస్కట్ తయారీ కంపెనీ ట్వీట్‌లో పేర్కొంది. సౌదీ మార్కెట్‌లలో లభించే పెప్సీ-కోలా, కోకాకోలా వంటి శీతల పానీయాలలో పంది మాంసం పదార్థాలు ఉండవని SFDA గతంలో తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com