కువైట్ ఇండియన్ ఎంబసీలో జనవరి 9న ‘ప్రవాసీ దివస్’ లైవ్ స్ట్రీమింగ్

- January 06, 2023 , by Maagulf
కువైట్ ఇండియన్ ఎంబసీలో జనవరి 9న ‘ప్రవాసీ దివస్’ లైవ్ స్ట్రీమింగ్

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం 2023 జనవరి 9, 10 తేదీల్లో ఎంబసీ ఆడిటోరియంలో 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భారతీయ కువైట్ ఎంబసీలో 9వ తేదీన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే లైవ్ స్ట్రీమింగ్‌లో చేరాలని ఎంబసీ భారతీయ పౌరులందరినీ ఆహ్వానిస్తుంది.10వ తేదీన మధ్యాహ్నం 1:00 నుండి 2:30 వరకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 08 - 10 జనవరి 2023 వరకు జరుగుతుంది. గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 09న ప్రారంభ సెషన్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. జనవరి 10వ తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి పాల్గొని ప్రసంగిస్తారు.

భారత ప్రభుత్వంతో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ సంబంధాలను బలోపేతం చేయడానికి, వారి మూలాలతో తిరిగి కనెక్ట్ చేయడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివస్ ను జరుపుకుంటారు. ఇండోర్‌లో జరిగే 17వ PBD సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో NRIలు హాజరవుతారు.ఈ సారి కన్వెన్షన్ ను "డయాస్పోరా: రిలియబుల్ పార్టనర్స్  ఫర్ ఇండియా ప్రొగ్రెస్ ఇన్ అమృత్ కాల్‌" థీమ్ తో నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com