ఆరోన్ మిల్లర్ ఏడు ప్రపంచ వింతల జాబితాలో ‘అల్ ఉలా’

- January 07, 2023 , by Maagulf
ఆరోన్ మిల్లర్ ఏడు ప్రపంచ వింతల జాబితాలో ‘అల్ ఉలా’

సౌదీ: ఉత్తర సౌదీ అరేబియాలోని అల్ ఉలా వారసత్వ నగరం 2023 ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో చోటుసంపాదించింది. ఈ జాబితాను అవార్డు గెలుచుకున్న ట్రావెల్ రైటర్ ఆరోన్ మిల్లర్ రూపొందించారు. అల్ ఉలా అసాధారణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ ప్రదేశం. అయితే, ఇటీవలి వరకు అరేబియా వెలుపల చాలా తక్కువ మందికి ఈ స్థలం గురించి తెలుసు.

మిల్లర్ ప్రకారం, 2022 చివరి నాటికి ఈ సైట్ అధికారికంగా సందర్శకులకు తెరవబడింది. ఇది 200,000 సంవత్సరాల పురాతన అరేబియా చరిత్రను ఆవిష్కరించింది. అల్ ఉలా సౌదీ అరేబియా వాయువ్య ఎడారి నడిబొడ్డున ఉంది. ఇక్కడ చాటా ప్రాంతాల్లో పరిశోధనలు జరగాల్సి ఉంది. 5 శాతం కంటే తక్కువ స్థలంలోనే తవ్వకాలు జరిగినట్లు అంచనా. UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ హెగ్రా (అల్-హిజ్ర్) దాని విస్తృతమైన స్మారక సమాధులకి ఇది ప్రసిద్ధి చెందింది.

అల్ ఉలా తో పాటు, 2023లో మిల్లర్ సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్‌లో జాబితాలో మోంట్ సెయింట్-మిచెల్, ఫ్రాన్స్; పెరిటో మోరెనో గ్లేసియర్, అర్జెంటీనా; టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ, భూటాన్; కప్పడోసియా, టర్కీ; ది లేక్ డిస్ట్రిక్ట్, గ్రేట్ బ్రిటన్; ది సార్డిన్ రన్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com