హనీ రోజ్.! బాలయ్య సినిమాలో ఎవరీ సీక్రెట్ నటి.?

- January 07, 2023 , by Maagulf
హనీ రోజ్.! బాలయ్య సినిమాలో ఎవరీ సీక్రెట్ నటి.?

బాలయ్య హీరోగా ‘వీర సింహారెడ్డి’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ‘శృతిహాసన్.’. అయితే, ఈ సినిమాకి సంబంధించి మరో నటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె పేరు ‘హనీ రోజ్’.
పేరు భలే వుంది కదా. అమ్మడు కూడా అంతే. అందానికి అందం, అంతకు మించిన అభినయం. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించింది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ తన సత్తా చాటింది. ఇప్పుడు తెలుగులో ‘వీర సింహారెడ్డి’తో ప్రేక్షకులకు దగ్గర కాబోతోంది.
ఆల్రెడీ ‘మనోభావాలు..’ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోలో హనీ రోజ్ పరిచయం అయిపోయింది. అయితే, అంతకు మించి ఈమె పర్‌ఫామెన్స్ సినిమాలో వుంటుందట. ఆ పాత్రకు ఆమెను సెలెక్ట్ చేయడం సూపర్ అని బాలయ్య కితాబిచ్చారు. ‘భలే అమ్మాయిని పట్టారే..’ అంటూ ఆమె పాత్ర గురించి చెప్పీ చెప్పకుండానే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు బాలయ్య. 
బాలయ్య చెప్పినట్లుగానే ఆమె పాత్ర ఆడియన్స్‌కి నచ్చితే టాలీవుడ్‌లో ఆఫర్లకు కొదవేం వుండదు. అన్నట్లు హనీ రోజ్ నటించిన ‘మానిస్టర్’ అనే సినిమా ఇటీవల ఓటీటీలో రిలీజైంది. మంచు లక్ష్మి కూడా ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. ఆ రకంగా ఓటీటీ ప్రేక్షకులకు ఈ భామ సుపరిచితురాలే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com