ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

- January 07, 2023 , by Maagulf
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ముంబై: ఇద్దరు ప్రయాణికులను ముంబై విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి మొత్తం రూ.47 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (జనవరి 6,2023)కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీలలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి రూ.47 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో దిగిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రయాణికుడికి చెందిన సూట్ కేసును పరిశీలించగా ఆ సూట్ కేసులో ఓ కుర్తీ అనుమానాస్పదంగా కనిపించింది. కుర్తీ గుండీలు సైజు పెద్దగానే కాకుండా ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువగా ఉండటంతో అధికారులు మరింత జాగ్రత్తగా తనిఖీ చేయగా.. గుండీల్లో దాచి ఉంచిన 1.596 కిలోల కొకైన్ బయటపడింది. దీని విలువ మార్కెట్లో 15.96 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత కొకైన్ ను తరలించటానికే కుర్తీకి ఉండాల్సి గుండీల కంటే కాస్త ఎక్కవ సంఖ్యలోను పెద్ద గుండీలను ఏర్పాటు చేసారని తెలిపారు అధికారులు.

అలాగే మరో కేసులో.. కెన్యా నుంచి వచ్చిన ప్రయాణికురాలు హ్యాండ్ బ్యాగులో దాచి తరలిస్తున్న 4.47 కిలోల హెరాయిన్ ను గుర్తించామని..దీని విలువ రూ.31.29 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com