దుబాయ్ లో రమదాన్ సందర్భంగా 734 మందికి క్షమా భిక్ష

- June 18, 2015 , by Maagulf
దుబాయ్ లో రమదాన్ సందర్భంగా 734 మందికి క్షమా భిక్ష

దుబాయ్: పవిత్ర రమదాన్ మాస ప్రవేశాన్ని పురస్కరించుకొని, దుబాయ్ పరిపాలకుడు, యు.ఎ.ఈ. యొక్క ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు మహారాజాశ్రీ  షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయిలోని వివిధ కారాగారాలలో, సంస్కరణ కేంద్రాలలో జైలు శిక్షను అనుభవిస్తున్న 734 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.

మహారాజాశ్రీ షేక్ మొహమ్మద్, బందీల కుటుంబాలలో ఆనందం నింపడానికి ఇచ్చిన ఆజ్ఞలను వెంటనే అమలుచేయడానికి అవసరమైన బహిరంగ న్యాయవిచారణ ప్రక్రియ, పోలీసు శాఖ వారి సహకరంతో వెంటనే ప్రారంభించబడినదని, దుబాయి అటర్నీ జనరల్ అల్ హుమైదాన్ తెలిపారు. శ్రీ షేక్ మొహమ్మదు గారి దయాధర్మ దృష్టికి అనేక కృతజ్ఞతలు తెలియచేశారు. అంతేకాకుండా, విడుదలైన ఖైదీలు, తమ మిగిలిన జీవితాన్ని, మతపరమైన, నైతిక పరమైన నియమాలకు ఒడంబాడి జీవించాలని పిలుపునిచ్చారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com