నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపునకు చర్యలు!
- January 08, 2023
కువైట్: నైపుణ్యం లేని నిర్వాసితుల సంఖ్యను తగ్గించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇఖామా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవడానికి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన వారిని పట్టుకోవడానికి, ప్రధానంగా బహిష్కృత జనాభా ఉన్న ప్రాంతాల్లో తనిఖీ ప్రచారాలు చేపట్టే చట్టాన్ని తెచ్చేందుకు ఇప్పటికే ముసాయిదా చట్టాన్ని జాతీయ అసెంబ్లీకి పంపనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అవసరమైన వారికి తప్ప ఈ ఏడాది మరేవరికీ అనుమతులు ఇవ్వకూడదని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించిన తెలుస్తోంది. లేబర్ మార్కెట్‌కు అవసరం లేకపోతే లేబర్ అనుమతులు ఈ సంవత్సరం పునరుద్ధరించబడవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికులను తీసుకువచ్చే వ్యాపారులపై రుసుము విధించేందుకు ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుందని సమాచారం. ఫీజులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని నిర్ధారించడానికి అధ్యయనం చేయబడుతుందని మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రవాసుల ఇఖామాల గురించి గతంలో చాలా మంది ఎంపీలతో అంతర్గ మంత్రిత్వ శాఖ మంత్రి చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







