బుఖాలో 93మీ వర్షపాతం.. పర్యాటకుల బృందాన్ని రక్షించిన అధికారులు

- January 08, 2023 , by Maagulf
బుఖాలో 93మీ వర్షపాతం.. పర్యాటకుల బృందాన్ని రక్షించిన అధికారులు

మస్కట్: గత మూడు రోజులుగా అనేక గవర్నరేట్‌లలో భారీ నుండి మోస్తరు వర్షాలు కురిశాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) వెల్లడించింది. ఖాసబ్‌లోని విలాయత్‌లోని ఒక వాడిలో ముగ్గురితో కూడిన కుటుంబాన్ని, ముసండం గవర్నరేట్‌లోని మరొక వాడిలో కారులో చిక్కుకుపోయిన పర్యాటకుల బృందాన్ని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ప్రకటించింది. పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, వాడీలను దాటడం ప్రమాదకరమని, లోతట్టు ప్రదేశాల నుండి దూరంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి అధికారిక సూచనలు ఫాలో కావాలని కోరారు.

వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకారం.. జనవరి 6 నుండి 8 వరకు బుఖా మూడు రోజుల్లో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు MAFWR రెయిన్ మానిటరింగ్ స్టేషన్‌ల నుండి సేకరించిన సమాచారం ప్రకారం.. ఖాసబ్‌లో 81 మిమీ, లివా 62 మిమీ, షినాస్ 42 మిమీ, మాధా 34 మిమీ, సోహర్ 18 మిమీ, నఖల్ 14 మిమీ, ఖబౌరా 11 మిమీ, సహమ్ 8 మిమీ , వాడి అల్ 5 మిమీ , మహ్వాల్ 6 మిమీ, సీబ్ 3 మిమీ, రుస్తాక్ 3 మిమీ, ముస్సానా 2 మిమీ వర్షపాతం నమోదైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com