విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్..

- January 08, 2023 , by Maagulf
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్..

ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విస్తారా ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. శనివారం ఎనిమివ వార్షికోత్సవం సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణలపై భారీగా ఆఫర్స్ ప్రకటించింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఛార్జీలను విడుదల చేసింది. ‘నేటితో ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో మున్ముందుకు దూసుకుపోతున్నాం. వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో కూడిన ఛార్జీలను ప్రకటించడం సంతోషంగా ఉంది. విస్తారాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేసి ప్రత్యేక ఛార్జీలను ఆస్వాదించండి.’ అని ఎయిర్‌లైన్ ప్రకటించింది.

దేశీయ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్‌ ధర రూ. 1899 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రీమియం ఎకానమీ ధర రూ. 2,699, బిజినెస్ క్లాస్‌ ధర రూ. 6,999 చొప్పున వన్ వే రూట్‌తో అన్ని ఛార్జీలతో కలిపి ఇవి వర్తిస్తాయి.

ఇక ఇంటర్నేషనల్ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఖాట్మండు) రూ. 13,299, ప్రీమియం ఎకానమీ(ఢిల్లీ-ఖాట్మండు)కి రూ. 16,799, బిజినెస్ క్లాస్(ఢిల్లీ-ఖాట్మండు, ముంబై-ఖాట్మండు) రూ. 43,699 గా ఉంది. అలాగే, ఎక్స్‌ట్రా సీట్, అదనపు బ్యాగేజీ కోసం టికెట్ కొనుగోలుపై 23 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది. కాగా, విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 23 జనవరి, 2023 నుంచి 30 సెప్టెంబర్ 2023 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లను 12 జనవరి 2023న అర్థరాత్రి 23:59 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రయాణికులు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ http://www.airvistara.com ను సందర్శించడం ద్వారా, iOS, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ద్వారా, ఎయిర్‌పోర్ట్ టిక్కెట్ ఆఫీసులలో (ATOలు), కాల్ సెంటర్ ద్వారా, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు (OTA), ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (SIA) జాయింట్ వెంచర్ అయిన ‘విస్తారా’ 2013లో స్థాపించారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఐరోపా దేశాలలో ఈ ఎయిలైన్స్ నడుస్తోంది. దేశంలోనే అగ్రగామిగా సేవలు అందిస్తోంది. అయితే, 29 నవంబర్ 2022న, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత విలీనం మార్చి 2024 నాటికి పూర్తవుతుందని అంచనా వేశారు. ఈ విలీనం పూర్తయితే.. ఎయిర్ ఇండియా 218 విమానాల సంయుక్త ఫ్లీట్‌తో భారతదేశంలోనే ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ క్యారియర్‌గా అవతరించనుంది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com