హైదరాబాద్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు..
- January 08, 2023
హైదరాబాద్: ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన ఈఎస్ఐలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు.పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.
https://www.esic.gov.in/recruitments
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న 106 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు పోస్టులు ఉన్నాయి.
- అనాటమీ, ఫిజియాలజీ, ఆర్థోపెడిక్స్, పెడియాట్రిక్ సర్జరీ, ఆంకాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జన్సీ మెడిసిన్, పాథాలజీ, పెడియాట్రిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీడీఎస్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 30 నుంచి 67 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 1,05,356 నుంచి రూ. 2,22,543 వరకు చెల్లిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 09-01-2023న ప్రారంభమై 16-01-2023తో ముగియనుంది.
- ఇంటర్వ్యూలను 20-01-2023 నుంచి 31-01-2023 వరకు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







