స్టూవర్ట్‌పురం దొంగలా మాస్ రాజా రవితేజ.!
- January 09, 2023
మాస్ రాజా రవితేజకు ‘ధమాకా’ మంచి హిట్ ఇచ్చింది. గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో విసిగిపోతున్న రవితేజకు ‘ధమాకా’ కలిసి రావడంతో హుషారు పెంచేశాడు.
తదుపరి సినిమాలను వేగవంతం చేశాడు. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మాస్ రాజా స్టూవర్ట్‌పురం దొంగలా కనిపించనున్నాడు.
1970ల కాలంలో స్టూవర్ట్‌పురంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నుపుర్ సనన్ ఒకరు కాగా, గాయత్రి భరద్వాజ్ మరొక ముద్దుగుమ్మ.
అన్నట్లు రేణు దేశాయ్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. ఓ ఇంపార్టెంట్ రోల్లో రేణు దేశాయ్ నటిస్తోంది. ఓ వైపు ‘ధమాకా’ హిట్టు.. మరో వైపు ‘వాల్తేర్ వీరయ్య’లతో జోరు మీదున్న మాస్ రాజా రవితేజకు, ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా కలిసొస్తే రవితేజ ఫ్యాన్స్ ఖుషీకి ఢోకా వుండదు మరి. ఈ ఏడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..