యూఏఈలో నిరుద్యోగ బీమా పరిహారానికి పది షరతులు

- January 11, 2023 , by Maagulf
యూఏఈలో నిరుద్యోగ బీమా పరిహారానికి పది షరతులు

యూఏఈ: యూఏఈలో మెజారిటీ కార్మికులు ఇప్పుడు నిరుద్యోగ బీమా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడానికి అర్హత పొందారు. అయితే పాలసీ ప్రయోజనాలను పొందడానికి కొన్ని కండిషన్లు విధించారు.  నిరుద్యోగ బీమా కార్యక్రమాన్ని నియంత్రించే 2022 ఫెడరల్ డిక్రీ-బిల్ నంబర్ 13లోని ఆర్టికల్ 5, చట్టం ఆమోదించబడిన తర్వాత ప్రచురించబడిన 2022 కేబినెట్ రిజల్యూషన్ నంబర్ 97లోని ఆర్టికల్ 9.. ఈ రెండూ బీమా పరిహారం పొందేందుకు కొన్ని నిబంధనలను పొందుపరిచారు. అనివార్య కారణాల వల్ల పని కోల్పోయిన కార్మికుడు మూడు నెలల పాటు వారి ప్రాథమిక జీతంలో 60% శాతాన్ని పొందవచ్చు.

బీమా పొందడానికి ముఖ్యమైన 10 కండిషన్లు

1. నిరుద్యోగ బీమా కార్యక్రమం కోసం సైన్ అప్ చేసిన తర్వాత కనీసం 12 వరుస నెలలు తప్పనిసరిగా కిస్తీలు చెల్లాంచాలి.

2. తప్పనిసరిగా అన్ని బీమా ప్రీమియంలను తగిన వ్యవధిలో చెల్లిస్తున్నారని నిర్ధారించుకోవాలి.

3. రాజీనామా కాకుండా ఇతర కారణాల వల్ల నిరుద్యోగులని చూపించాలి.

4. క్రమశిక్షణా కారణాల వల్ల మీరు మీ పని నుండి తొలగించబడకూడదు.

5. ఉపాధి కోల్పోయిన 30 రోజులలోపు లేదా లేబర్ ఫిర్యాదుపై న్యాయస్థానం తీర్పునిచ్చిన రోజు, ఏది ముందుగా వచ్చినా క్లెయిమ్‌లు తప్పనిసరిగా దాఖలు చేయాలి.

6. పరారీలో ఉన్న యాక్టివ్ రిపోర్ట్‌లో కార్మికుడి పేరు ఉండకూడదు.

7. పరిహారం పొందేందుకు ఎలాంటి మోసపూరిత క్లెయిమ్‌లు చేయకూడదు.  

8. మరొక యజమానితో ఉపాధి ఒప్పందం చేసుకున్న సందర్భంలో  పరిహారం చెల్లింపు ఆగిపోతుంది.

9. సమ్మెలు లేదా ఇతర హింసాత్మక నిరసనలలో పాల్గొడం ఉద్యోగం కోల్పోయేందుకు కారణాలుగా పరిగణించరు.

10. బీమా చేసిన వ్యక్తి తప్పనిసరిగా దేశంలో రిజిస్టర్డ్ రెసిడెన్సీ కలిగి ఉండాలి.

రెండు వారాల్లో పరిహారం

ఆర్టికల్ 12 ప్రకారం, బీమా పాలసీని రెండు వారాల్లో పరిష్కరించాలి. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ లైసెన్స్ పొందిన సర్వీస్ ప్రొవైడర్లు వచ్చిన క్లెయిమ్‌ను స్వీకరించిన రెండు వారాలలోపు బాధితులకు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com