ఖతార్ లో నాలుగు ట్రక్కులు సీజ్
- January 11, 2023
ఖతార్: సహజ వాతావరణాన్ని దెబ్బతీసినందుకు నాలు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కుల డ్రైవర్లపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో సిమెంట్ మిక్సర్, ట్యాంకర్, జేసీబీలు ఉన్నాయని వాటి ఫోటోలను మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. వన్యప్రాణి అభివృద్ధి విభాగానికి చెందిన వన్యప్రాణి పునరావాస యూనిట్ ఇన్స్పెక్టర్లు నర్సరీలోకి ప్రవేశించి మొక్కలను ధ్వంసం చేసిన నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నాయని ట్వీట్ లో మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. హెవీ వెహికిల్ డ్రైవర్లు, క్యాంపింగ్ ప్రాంతాలను సందర్శించే క్యాంపర్లు తమ వాహనాలను పచ్చికభూములు, కూరగాయల ఫ్లాట్లలోకి తీసుకురావద్దని పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







