బూస్టర్ డోస్ గా కోవోవాక్స్ వ్యాక్సిన్
- January 13, 2023
న్యూ ఢిల్లీ: సీరం కంపెనీకి చెందిన కోవోవాక్స్ వ్యాక్సిన్ లు బూస్టర్ డోస్ గా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు సిఫారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరికీ కోవోవాక్స్ వ్యాక్సిన్ హెటెరో లాగస్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
కంపెనీకి చెందిన డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ సమీక్షించింది. ఈ మేరకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ నోవావాక్స్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను సీరమ్ కంపెనీ కోవోవాక్స్ పేరుతో ఉత్పత్తి చేస్తోంది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







