ఒమన్ లో డివిడెండ్‌లపై విత్‌హోల్డింగ్ పన్ను రద్దు
- January 13, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో నివాసితులు కాని వారి స్టాక్ డివిడెండ్‌లు, వడ్డీపై విత్‌హోల్డింగ్ పన్నును నిలిపివేయాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. డివిడెండ్, వడ్డీపై పన్నును నిలిపివేయడం వలన నాన్-రెసిడెంట్ విదేశీ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుతుందని, స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన సెక్యూరిటీలు పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారతాయని మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సీఈఓ స్పష్టం చేశారు. షేర్ల డివిడెండ్‌ల పంపిణీ, సుకుక్, బాండ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ ఇన్వెస్టర్‌ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మూలం వద్ద ఉన్న విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ను సస్పెండ్ చేయాలన్న రాయల్ ఆర్డర్ విదేశీ ఇన్వెస్టర్లలో ట్రేడింగ్‌ను పునరుజ్జీవింపజేసేందుకు దోహదపడతాయని క్యాపిటల్ మార్కెట్ అథారిటీ సీఈఓ, హిస్ ఎక్సలెన్సీ తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







