యూఏఈలో వ్యాపారం చేసేందుకు కనీస వయోపరిమితి సవరణ
- January 14, 2023
యూఏఈ: యుఎఇలో వ్యాపారాన్ని నిర్వహించడానికి కనీస వయోపరిమితిని సవరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త చట్టం ప్రకారం వ్యాపారాన్ని నిర్వహించేందుకు వ్యక్తికి కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. ఇది గతంలో 21 వయస్సులుగా నిర్ణయించారు. కొత్త చట్ట సవరణ అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి సవరణలకు సంబంధించిన మార్గదర్శకాలు అక్టోబర్ 2022లో ప్రచురించబడ్డాయి. కానీ ఇప్పుడు చట్టంగా అమలు చేయబడిందని పేర్కొంది.
కొత్త చట్టం ప్రకారం:
- ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో (గతంలో 21 సంవత్సరాలు) వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుమతించారు.
- పెట్టుబడిని ప్రోత్సహించడానికి, వృద్ధి, పోటీకి విస్తృత పరిధితో వ్యాపారాలను అందించడానికి బ్యాంకింగ్ సంస్థలు వాణిజ్య లావాదేవీల కోసం చట్టపరమైన సూచనను అనుసరించాలి.
- ఇస్లామిక్ బ్యాంకింగ్‌కు మద్దతు పెరిగింది. ఇది వృద్ధికి ప్రధాన అంశాలలో ఒకటిగా స్థిరపడింది.
- ఆర్థిక మార్కెట్ల నియంత్రణ, స్థాపన ప్రకారం లైసెన్సులను పొందడం తప్పనిసరి.
- డిజిటల్ రంగాలకు సంబంధించిన సాంకేతిక రంగ వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలకు మద్దతు అందించబడుతుంది.
- ఇంతకుముందు, 18-21 సంవత్సరాల మధ్య వ్యక్తి ప్రారంభించిన వ్యాపారాన్ని 'తాత్కాలిక యజమాని'గా చట్టపరమైన సంరక్షకుని క్రింద నమోదు చేయాలి. వ్యక్తి చట్టబద్ధమైన వయస్సును చేరుకున్న తర్వాత, షేర్లను బదిలీ చేయవచ్చు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







