‘వారసుడు’.! ఎగిరెగిరి పడ్డాడు కానీ.!
- January 14, 2023
ఇంకేముంది.. రిలీజ్‌కి ముందు ‘ఇంతన్నాడంతన్నాడే.. గంగరాజు.. ముంత మామిడి పండన్నాడే.. గంగరాజు..’ అన్న చందంగా, ఎగిరెగిరి పడ్డాడు. ధియేటర్ల గోల ఎత్తి, నిర్మాతల మధ్య అనవరసరమైన రగడ కూడా లేవదీశాడు.
తీరా చూస్తే రిలీజ్ వాయిదా వేసుకుని తుస్సుమనిపించాడు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకీ పాటికి అర్ధమైపోయే వుంటుంది. అక్షరాలా ఆయనే నైజాం రాజుగా ఫీలయ్యే దిల్ రాజు.
ఆయన నిర్మాణంలో రూపొందిన ‘వారసుడు’ సినిమాని సంక్రాంతి బరిలో వుంచేందుకు కాదు, కాదు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం వంటి అగ్ర హీరోలతో పోటీకి పెట్టేందుకు తెగ వెంపర్లాడాడు. కానీ నిలవలేకపోయాడు.
తమిళ వెర్షన్ 11న రిలీజ్ అయ్యింది కానీ, అనుకున్న అదే టైమ్‌కి తెలుగులో రిలీజ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఓ పక్క ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు రిలీజ్ అయిపోయాయ్. సక్సెస్ టాక్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ మాంచి హుషారు మీదుంది.
ఈ జోష్‌లో ‘వారసుడు’ పూర్తిగా మట్టి కొట్టుకు పోయాడు. అస్సలు బజ్ లేకుండా పోయింది. సంక్రాంతి సందర్భంగా 14న ‘వారసుడు’ రిలీజ్ అవుతోంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







