పురావస్తు ప్రదేశాల సందర్శన ప్రవేశ రుసుములు ఖరారు

- January 15, 2023 , by Maagulf
పురావస్తు ప్రదేశాల సందర్శన ప్రవేశ రుసుములు ఖరారు

మస్కట్: కోటలు, చారిత్రక ప్రదేశాలు, కేంద్రాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు ప్రవేశ రుసుములను వారసత్వ, సాంస్కృతిక శాఖ ఖరారు చేసింది. పురావస్తు ప్రదేశాలకు ప్రవేశ రుసుము 6-12 సంవత్సరాల వయస్సు గల ఒమానీలకు 200 బైసాలు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 1గా నిర్ణయించారు. సుల్తానేట్ నివాసుల విషయానికొస్తే 6-12 సంవత్సరాల వయస్సు గల సందర్శకులకు టిక్కెట్ విలువ 500 బైసాలు, 12 ఏళ్లు పైబడిన వారికి OMR 1గా పేర్కొన్నారు. నాన్-రెసిడెంట్స్ విషయంలో 6-12 సంవత్సరాల వయస్సు వారికి OMR 1, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 3 గా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉన్న కోటలను ఈ నిర్ణయం నుండి మినహాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రవేశ రుసుముల నుంచి అధికారిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యా సంస్థలు నిర్వహించే పాఠశాల పర్యటనలకు మినహాయింపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com