సౌదీ అరేబియాలో 3.3 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం
- January 16, 2023
రియాద్: సౌదీ అరేబియాలో డిసెంబర్ 2022కు సంబంధించి ద్రవ్యోల్బణం అంతకుముందు ఏడాది అదే కాలంతో పోల్చితే 3.3%కి పెరిగింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) డేటా ప్రకటించింది. హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల ధరలు 5.9 శాతం.. ఆహారం, పానీయాల ధరలు 4.2 శాతం పెరగడం వల్ల డిసెంబరులో వార్షిక ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైందని అధికార యంత్రాంగం పేర్కొంది. CPI 490 గ్రూపులో ఉన్న వస్తువులు, సేవల ధర మార్పులను ప్రతిబింబిస్తుంది. హౌసింగ్, నీరు, విద్యుత్తు, గ్యాస్, ఇతర ఇంధనాల విభాగంలో పెరుగుదల గృహాల కోసం చెల్లించే అద్దె ధరలలో 6.8 శాతం పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో అపార్ట్‌మెంట్ అద్దె ధరలు 18.1 శాతం పెరిగింది. మాంసం, పౌల్ట్రీ ధరలు 5.9 శాతం పెరిగాయి. డిసెంబర్ 2022లో ద్రవ్యోల్బణం రేటు 0.3 శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. సౌదీ అరేబియాలో వినియోగదారుల ధరల సగటు వార్షిక ద్రవ్యోల్బణం 2021 వార్షిక సగటుతో పోలిస్తే 2022కి 2.5 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







