షూటింగ్‏లో గాయపడిన స్టార్ హీరో..

- January 16, 2023 , by Maagulf

కౌలాలంపూర్: బిచ్చగాడు సినిమాతో తెలుగులో క్రేజ్ సంపాదించుకున్నారు హీరో విజయ్ ఆంటోని. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఇప్పుడు ఆయన చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. ప్రస్తుతం విజయ్ బిచ్చగాడు 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మలేషియాలో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సెట్ లో విజయ్ కు ప్రమాదం జరిగింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాడవంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కౌలాంలపూర్ లో పిచ్చైక్కారన్ 2(బిచ్చగాడు 2) సెట్ లో ఆయన గాయపడినట్లుగా సమాచారం. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయ్ వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్రయూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాట్ర బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దసూకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయ్ కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అతడిని కౌలాలంపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని.. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com