షాకింగ్: జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడానికి కారణమదేనా.?
- January 17, 2023
ఎంత బిజీ అయినా కానీ, జబర్దస్త్‌ని వదులుకోనని చెప్పిన బుల్లితెర యాంకర్ అనసూయ ఈ మధ్య జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ మధ్య పెద్దగా షోలలోనూ అనసూయ కనిపించడం లేదు.
అఫ్కోర్స్.! సినిమాల్లో చాలా బిజీ అయిపోయిందనుకోండి. ‘పుష్ప 2’, ‘హరి హర వీరమల్లు’, ‘భోళా శంకర్’ తదితర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌లో నటిస్తోంది అనసూయ భరద్వాజ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, జబర్దస్త్ నుంచి తాను తప్పుకోవడానికి కారణం బాడీ షేమింగ్, తనపై వేస్తున్న జుగుప్సాకరమైన పంచ్‌ల కారణంగానే తాను ఆ షో నుంచి తప్పుకున్నట్లు గతంలో వ్యాఖ్యానించింది అనసూయ.
అయితే, ఇప్పుడు మాత్రం తన కొడుకుల వల్లే ఆ షో వదిలేశానని చెబుతోంది విచిత్రంగా. తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం కోసమే టీవీ షోలకి గుడ్ బై చెప్పేశానంటూ అనసూయ తాజాగా చెబుతోంది. ఈ మాటలకు సోషల్ మీడియాలో భిన్న రకాల స్పందనలు వినిపిస్తున్నాయ్.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







