మహేష్ - త్రివిక్రమ్ మొదలు పెట్టేదెప్పుడంటే.!
- January 17, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 28 వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లింది. శరవేగంగా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసేసుకుంది.
అయితే, మహేష్ ఇంట్లో అనుకోకుండా జరిగిన విషాద సంఘటనల కారణంగా ఈ షూటింగ్ తాత్కాలికంగా ఆపివేయబడిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడిన మహేష్ బాబు, మళ్లీ షూటింగ్‌కి సిద్ధమవుతున్నాడట.
ఇటీవలే న్యూ లుక్‌తో మేకోవర్ కూడా అయ్యాడు. జనవరి 18 నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుందట. కీలక పాత్ర ధారులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారట. లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట త్రివిక్రమ్ ఈ సారి. మొదటి షెడ్యూల్‌లాగే, ఈ షెడ్యూల్‌లోనూ ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నాడట మాటల మాంత్రికుడు.
పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల మరో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







