విమాన టిక్కెట్‌తో 96 గంటల వీసా: సౌదీ ఎయిర్‌లైన్

- January 19, 2023 , by Maagulf
విమాన టిక్కెట్‌తో 96 గంటల వీసా: సౌదీ ఎయిర్‌లైన్

సౌదీ: సౌదీ అరేబియా విమానయాన సంస్థ సౌదీయా ఎయిర్‌లైన్ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. విమాన టిక్కెట్‌ కలిగి ఉన్న ప్రయాణికులు గరిష్టంగా నాలుగు రోజులు (లేదా 96 గంటలు) సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో హజ్, ఉమ్రా చేయడానికి ప్రయాణీకుడు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఎయిర్ అరేబియా అబుధాబి విమాన టిక్కెట్‌లతో పాటు 48 నుండి 96 గంటల ట్రాన్సిట్ వీసాలను అందించే అనేక యూఏఈ ఆధారిత విమానయాన సంస్థలలో ఈ వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉంది. ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో విమాన టిక్కెట్‌లను బుక్ చేసే సమయంలోనే వీసా ఆప్షన్ ను ఎంచుకోవాలని సౌదీయా ఎయిర్‌లైన్ సూచించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com