సుఖేష్‌ చేతిలో అలా మోసపోయానంటోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.!

- January 19, 2023 , by Maagulf
సుఖేష్‌ చేతిలో అలా మోసపోయానంటోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.!

200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్‌ వలలో పడిన అందాల భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్.. ఆ చిక్కుల్లోంచి బయటికి రాలేక గిల గిలా కొట్టుకుంటోంది. 
తాజాగా ఢిల్లీ కోర్టులో ఫిటిషన్ సమర్పించిన జాక్వెలీన్, సుఖేష్ కారణంగా తన జీవితం నాశనమైపోయిందనీ తెలిపింది. సుఖేష్ తనను తాను ఓ గవర్నమెంట్ అధికారిగా పరిచయం చేసుకున్నాడని పిటిషన్‌లో పేర్కొంది.
తన మేకప్ అసిస్టెంట్‌కి స్నేహితురాలైన పింకీ ద్వారా సుఖేష్‌తో పరిచయం ఏర్పడిందనీ, ఆమె తనను మోసం చేసి, సుఖేష్ వలలో చిక్కేలా చేసిందనీ వాపోయింది. తనకు పరిచయం అయ్యేటప్పటికి సుఖేష్ గురించి ఏమీ తెలియదని, తనకు అభిమానినంటూ దగ్గరయ్యాడనీ, ఆ తర్వాతే అతను జైలులో వున్నట్లు తెలిసిందనీ జాక్వెలీన్ పిటీషన్‌లో పేర్కొంది.
ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇస్తున్నప్పుడూ, ప్రత్యేక విమానాల్లో తిప్పుతున్నప్పుడే అనుమానం వచ్చి, ఆరా తీయగా, తాను సన్ టీవీ యజమానిని అని మరో అబద్దం చెప్పాడట. తనతో ఓ సినిమా తీస్తానని నమ్మబలికాడట. అలా సుఖేష్ వలలో పడిన జాక్వెలీన్ ఇప్పుడు లబోదిబోమంటోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com