సునీల్ ‘సూపర్’ సర్‌ప్రైజ్.! పోలా అదిరిపోలా.!

- January 19, 2023 , by Maagulf
సునీల్ ‘సూపర్’ సర్‌ప్రైజ్.! పోలా అదిరిపోలా.!

కమెడియన్‌గా పరిచయమై, హీరోగా ప్రూవ్ చేసుకున్న నటుడు సునీల్. ఆ తర్వాత విలన్‌గానూ తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు. డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేస్తూ, సరికొత్తగా కెరీర్ బిల్డప్ చేసుకుంటున్నాడు.
‘పుష్ప’ సినిమా కోసం మంగళం శీనుగా నెగిటివ్ అవతారమెత్తిన సునీల్, ఇప్పుడు మరోసారి పవర్ ఫుల్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సారి తన విలనిజాన్ని తమిళ తంబీలకు పరిచయం చేయబోతున్నాడు సునీల్.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జైలర్’ సినిమాలో విలన్‌గా నటించే ఛాన్స్ కొట్టేశాడు సునీల్. వెరీ లేటెస్టుగా ఈ సినిమా నుంచి సునీల్ పాత్ర తాలూకు లుక్ రిలీజ్ చేశారు.
‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సునీల్‌కి తమిళ నాట మంచి పేరు తీసుకొస్తుందని ఆశిద్దాం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com