రెండో పుష్ప రాజ్ జోరు పెంచాడుగా.!

- January 19, 2023 , by Maagulf
రెండో పుష్ప రాజ్ జోరు పెంచాడుగా.!

డిశంబర్‌లోనే ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ, కేవలం ఐదు రోజులు షూటింగ్‌లో మాత్రమే అల్లు అర్జున్ పాల్గొన్నాడు. మళ్లీ ఇప్పుడే తాజా షెడ్యూల్‌ కోసం బన్నీ సిద్ధమయ్యాడట. 
ఆ క్రమంలోనే ఈ రోజు వైజాగ్‌కి ప్రయాణమైనట్లు తెలుస్తోంది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సారి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ లీడ్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 
సునీల్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నట్లు ఈ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులంతా పాల్గొనబోతున్నారట. ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీన్‌ని ఈ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశాడట సుకుమార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com