హాలిడే మేకర్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా దుబాయ్

- January 19, 2023 , by Maagulf
హాలిడే మేకర్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా దుబాయ్

యూఏఈ: 2023లో ప్రపంచంలోని హాలిడే మేకర్లకు అత్యుత్తమ గమ్యస్థానంగా వరుసగా రెండో ఏడాది దుబాయ్ నిలిచింది. ట్రిప్యాడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ ను బుధవారం ప్రకటించింది. నవంబర్ 1, 2021 నుండి అక్టోబరు 31, 2022 వరకు ట్రిప్యాడ్వైజర్ వెబ్‌సైట్‌లో మిలియన్ల మంది ప్రయాణికుల సమీక్షల ఆధారంగా నగరాలను ఎంపిక చేశారు. ‘‘దుబాయ్ ఎకనామిక్ ఎజెండా D33 యొక్క ముఖ్య లక్ష్యంతో రూపొందించబడిన విధంగా దుబాయ్‌ని పర్యాటకం,వ్యాపారం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చాలనే నాయకత్వ దృక్పథాన్ని గ్లోబల్ ట్రావెలర్‌ల అత్యున్నత ర్యాంకింగ్ ప్రతిబింబిస్తుంది. గ్లోబల్ ఈవెంట్‌లకు ప్రముఖ వేదికగా ఆవిర్భవించింది. ప్రతిభావంతులకు గమ్యస్థానంగా ఉంది. వచ్చే దశాబ్దంలో గ్లోబల్ ట్రావెలర్స్‌లో ఫేవరెట్ హోదాను పటిష్టం చేస్తుంది. ”అని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హర్షం వ్యక్తం చేశారు.

2023లో అత్యంత ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానాలు

1.       దుబాయ్, యూఏఈ 

2.       బాలి, ఇండోనేషియా

3.       లండన్, యూకే

4.       రోమ్, ఇటలీ

5.       పారిస్, ఫ్రాన్స్

6.       కాంకున్, మెక్సికో

7.       క్రీట్, గ్రీస్

8.       మరకేష్, మొరాకో

9.       డొమినికన్ రిపబ్లిక్

10.   ఇస్తాంబుల్, టర్కీ

మహమ్మారి తర్వాత గత రెండేళ్లలో ఎమిరేట్ పర్యాటక రంగం బలంగా పుంజుకుంది. దుబాయ్ ఎకానమీ,  టూరిజం డేటా ప్రకారం.. జనవరి-నవంబర్ 2022లో దుబాయ్‌కి 12.82 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు.  ఈ 11 నెలల్లో  794 హోటల్స్ 73 శాతం ఆక్యుపెన్సీ(మొత్తం గదులు145,098 ) సాధించాయి. 2022లో వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం, దుబాయ్ ప్రపంచంలోని అన్ని నగరాల్లో కంటే దుబాయ్ అత్యధిక టూరిస్ట్ స్పెండింగ్ ను ($29.4 బిలియన్లకు (Dh108 బిలియన్)) అందుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల నివేదిక 2023లో ఎమిరేట్ ఇటీవల ప్రాంతీయంగా మొదటి, ప్రపంచంలో ఐదవ ఉత్తమ నగరంగా ర్యాంక్ పొందిన విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com