34 మందికి క్షమాభిక్ష

- January 19, 2023 , by Maagulf
34 మందికి క్షమాభిక్ష

కువైట్: అమిరి అమ్నెస్టీ డిక్రీ బుధవారం అధికారిక గెజిట్ కువైట్ అల్-యూమ్‌లో ప్రచురించారు. డిక్రీ ప్రకారం.. HH అమీర్ లేదా అరబ్ నాయకులపై అభ్యంతరకరమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు 34 మంది కువైట్ పురుషులు, మహిళలు జైలు శిక్ష నుండి క్షమాభిక్ష పొందారు. క్షమాభిక్ష పొందిన వారిలో చాలా మంది కువైట్ జైళ్లలో సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన వారు వివిధ దేశాలలో స్వచ్ఛంద ప్రవాసంలో ఉంటున్నారు. క్షమాభిక్ష పొందిన వారిలో చాలా మంది తమకు క్షమాభిక్ష మంజూరైనట్లు ట్విట్టర్‌లో ధృవీకరించారు. మాజీ సీక్రెట్ సర్వీస్ చీఫ్ షేక్ అత్బీ అల్-ఫహాద్ అల్-సబా క్షమాభిక్ష పొందిన వారిలో ఆయన కూడా ఉన్నారని ఆయన బంధువులు ధృవీకరించారు. కొన్నేళ్లుగా షేక్ అత్బీ ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు, సామాజిక కార్యకర్తలు అమీర్‌ను ప్రశంసించారు. క్షమాభిక్ష డిక్రీని స్వాగతించారు. ఇతర రాజకీయ ఖైదీలకు కూడా త్వరలో క్షమాభిక్ష లభిస్తుందని నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అహ్మద్ అల్-సాదౌన్ ఆశాభావం వ్యక్తం చేశారు.కువైట్ పౌరులు చెల్లించాల్సిన బిలియన్ల దినార్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలనే బిల్లుతో సహా అనేక ప్రజాకర్షక ముసాయిదా చట్టంపై ప్రభుత్వం, జాతీయ అసెంబ్లీ మధ్య సంబంధాలు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో క్షమాభిక్ష డిక్రీ రావడం హాట్ టాఫిక్ గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com